Skip to main content

Posts

వీకెండ్ స్టోరీ: హండ్రెడ్ పర్సెంట్ హరామ్

ఈ మధ్య కొద్ది నెలలుగా టెండర్ కట్స్ పేరుతో ఓ భారీ వ్యాపార ప్రకటన ఖరీదైన ఇంగ్లిష్ పేపర్లో, ఫ్రంట్ పేజ్‍లో దర్శనమిస్తోంది. త్వరలో హైదరాబాద్ లో మటన్, చికెన్, ఎగ్స్, ఫిష్, ప్రాన్స్.. ఇలా మాంసాహార ఉత్పత్తులు మీరు కోరుకున్న చోటికి డోర్ డెలివరీ అంటూ ఊదరగొడుతోంది. ఇప్పుడైతే హైదరాబాద్ లోని 11 సెంటర్లలో టెండర్ కట్స్ దుకాణాలు రెడీ అయ్యాయని కూడా తాజాగా మరో ప్రకటన వెలువడింది. అది వ్యాపార ప్రకటన కాబట్టి అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఈ యాడ్ లో చక్కగా బొట్టు పెట్టుకున్న ఈ హిందూ మహిళ చేత ఎంతో గర్వంగా పోజిప్పించి టెండర్ కట్స్ మాంసానికి బ్రాండ్ అంబాసిడర్ లెవెల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇక ఎడమవైపు పైన 100 PER CENT HALAL అంటూ స్టార్ గుర్తులో హైలైట్ చేయడమే ఈ నాలుగు మాటలు మాట్లాడుకోవడానికి దారితీస్తోంది.  హలాల్ అనేది ముస్లింల విశ్వాసాల ప్రకారం దేవునికి సమర్పించుకునే నైవేద్యం. ముస్లిమేతరులు ముస్లిమేతర పద్ధతుల్లో సమర్పించుకునే నైవేద్యాన్ని సంప్రదాయ ముస్లింలు ఎవరూ ముట్టుకోరు. మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా చెబుతున్న షరియా సూత్రాలను ఇండియన్ ముస్లింలు పెద్దసంఖ్యలో తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బయటి ...

భారత్ ఆక్రమణలో మావో జెడాంగ్ థియరీనే చైనా అమలు చేస్తోందా?

అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగాన్ని చైనా ఆక్రమించడం, అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేయడం సంచలనం రేపుతోంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం ఇవాళ కొత్త కాదు. కానీ భారత్ చైనాను విజయవంతంగా నిలువరిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే చైనా అరుణాచల్ మీద ఎందుకు కన్నేసిందనేదే ముఖ్యాంశం.  ఎలా బయటపడింది? అమెరికాలోని ప్లానెట్ ల్యాబ్స్ తీసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. ఆ ఇమేజెస్ గత నవంబర్ లోవి. తాజా ఫొటోల్లో కొత్త ఇళ్ల సముదాయం కనిపించింది. అదే చోట 2019 ఆగస్టులో ఇళ్లేవీ లేవు. ఇళ్లు నిర్మించిన ప్రాంతం భారత్-చైనా సరిహద్దు నుంచి అరుణాచల్ భూభాగంలో దాదాపు 5 కి.మీ. లోపలికి వచ్చేసింది. అంటే ఏడాదిలో చైనా అక్కడ శాశ్వత మానవ నివాసాలను నిర్మించిందన్నమాట. సారీ చూ అనే నది ఒడ్డున చైనా పౌరులకు శాశ్వత నివాసాలు నిర్మిస్తోంది. చైనా పౌరులు కూడా ఇప్పుడక్కడ తరచుగా కనిపిస్తున్నారు. దీనిపై స్థానిక బీజేపీ ఎంపీ కూడా కేంద్రాన్ని అలర్ట్ చేశాడు.  చైనా ఎందుకిలా చేస్తోంది? చైనా భారత భూభాగం మీద కన్నేయడమనేది కొత్త కాదు. ఆక్రమించడానికి చైనా ఎప్పట్నుంచో కాచుకొని ఉంది. నెహ్రూ హయాంలోనే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడం మ...

వీకెండ్ స్టోరీ-ఏపీలో విగ్రహాల విధ్వంసకాండ ఆపాల్సింది ఎవరు?

ఏపీలో ఏ జిల్లా చూసుకున్నా విధ్వంసకాండ మాత్రం కామన్ గా మారింది. జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు కొలువుదీరిన శ్రీశైలం నుంచి దేశప్రజలందరికీ ఆరాధ్య దైవమైన రామతీర్థం రాములవారి క్షేత్రం దాకా ఎక్కడ చూసినా మత విద్వేషం బుసలుకొడుతోంది. హిందువుల సెంటిమెంట్లను పనిగట్టుకొని గాయపరచడమే ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తోంది. అయినా పాలకులకు గానీ, అధికారులకు గానీ ఆ విషయాలేవీ పట్టటం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగానూ అదే రిపీటైంది.  Also Read:   తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర? Also Read:   ఒవైసీ వ్యూహం వెనుక ఏముందంటే.. పిల్లి కళ్లు మూసుకుంటే ఎలుకొచ్చి వెక్కిరిస్తుందని సామెత. ఆ ఎలుక ఇంకా ఏం చేస్తుందో మాటల్లో చెప్పడం బాగుండదు కానీ.. ఆంధ్రాలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి, ఆనందం అనుభవిస్తున్న సమయంలో.. ఏపీలో మాత్రం దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది సమయంలో తెల్లవారుతుందనగా రాజమండ్రిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి చేతులు విరిచేశారన్న వార్త మీడియా ద్వారా ప్రపంచానికి చేరింది. అంతకు కొద్ది గంటల ముందే, డిసెంబర్ 30న విజయనగరం జిల్లా ర...

ఒకే కాలనీలో 12 వేల మందికి నూతన గృహాలు

విజయనగరం జిల్లాలోని గుంకలామ్ లో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 12,301 ఇళ్లతో నిర్మించబోయే వై.ఎస్.ఆర్.జగనన్న కాలనీకి శంకుస్ధాపన జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎం.పి.లు వి. విజయసాయి రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా. ఎం.హరిజవహర్ లాల్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. 
ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంటసాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప...

వీకెండ్ స్టోరీ- ఆధునిక ఆదర్శ హిందూ వివాహం ఇదే

హిందూ సమాజ వ్యవస్థ ఎంత సంక్లిష్టమైందో... అంత సానుకూలమైంది కూడా. అయితే అనుకూలతలు అటుంచి కేవలం సంక్లిష్టతలు మాత్రమే ఎత్తిచూపే ప్రబుద్ధులు తమ దుర్బుద్ధిని మార్చుకోవాల్సిన సందర్భాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అందుకు కరీంనగర్‍లో జరిగిన తాజా పెళ్లే ఓ ఉదాహరణ.  డిసెంబర్ 23వ తేదీన కరీంనగర్ లో జరిగిన సహస్ర-మహేశ్‍ల పెళ్లి కులాతీత ఆధునిక హిందూ ఆదర్శ వివాహానికి ఓ ఆనవాలుగా నిలిచిపోతుంది. ఎందుకంటే పెళ్లికూతురు, పెళ్లికొడుకు, పెళ్లిపెద్దలు.. ఇలా ముగ్గురూ మూడు సామాజికవర్గాలకు చెందినవారు కావడం విశేషం. సహస్ర (ముదిరాజ్), మహేశ్ (మేరు)తో పాటు పెళ్లిపెద్దలైన రాజ్‍కుమార్-అన్నపూర్ణ (విశ్వబ్రాహ్మణ) వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. వీరెవరూ రక్త సంబంధీకులు కాకపోయినా, అమ్మాయి-అబ్బాయిల కులపెద్దల మద్దతు కోసం ఎదురుచూడకుండా.. కేవలం అమ్మాయి-అబ్బాయి కుటుంబాలతో ఉన్న పాత పరిచయం, స్నేహాన్నే ఆత్మబంధంగా భావించి యువజంటను ఒక్కటి చేశారు. ఖర్చులకు వెనుకాడకుండా బంధువర్గం, ఉద్యోగ స్నేహితులు.. ఇలా అందరూ మెచ్చేలా అంగరంగ వైభవంగా సహస్ర పెళ్లిబాధ్యతలు పూర్తి చేశారు. నేటి కాలానికి అవసరమైన అసలైన హిందూ ఆదర్శ వివాహాన్ని ఆచరించి చూప...

weekend story- కృత్రిమ చికెన్: నేటి నుంచే మార్కెట్‍లోకి

Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు IMP Story:   ఎంఐఎంతో పొత్తు కోసం తహతహ ఇందుకేనా? మానవ జిహ్వ చాపల్యానికి వీకెండ్స్ లో ఎన్ని మూగజీవాలు క్యూ కట్టి బలవుతున్నాయో ఊహించజాలం. అయితే మానవులు జిహ్వచాపల్యాన్ని అణచుకోకుండానే మూగజీవాలు సంతోషించే రోజు రానే వచ్చింది. దాదాపు పదేళ్లుగా జరుగుతున్న ప్రయోగాలకు ఎండ్ కార్డ్ పడుతోంది. మార్కెట్ లోకి కృత్రిమ చికెన్ వచ్చేసింది. భవిష్యత్తులో కోళ్లన్నీ ఆనందించే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ్టి నుంచే (డిసెంబర్ 19) సింగపూర్లో కృత్రిమ చికెన్ "రెస్టారెంట్ 1880" లోకి అడుగు పెడుతోంది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించింది. చికెన్ సెల్స్ నుంచి మాంసకృత్తులను డెవలప్ చేసి ల్యాబ్ లో తయారుచేసిన చికెన్ సింగపూర్ రెస్టారెంట్లలో ఇవాళ్టి డిన్నర్ నుంచే ఘుమఘుమలాడుతుంది. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న కుర్రాళ్లే ఈ కృత్రిమ చికెన్ తొలి వినియోగదారులు కావడం విశేషం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈట్ జస్ట్ కంపెనీయే సింగపూర్ లో దాని ఉత్పత్తిని తొలిసారిగా మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీ సీఈఓ లీ-కా-షింగ్ సింగపూరియన్ కావడం గమ...