Skip to main content

Posts

వీవీఐఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేపూరి

విశ్వబ్రాహ్మణ - విశ్వకర్మ ఐక్య సంఘం  (వీవీఐఎస్) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేపూరి లక్ష్మణాచారిని నియమిస్తూ ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన ఆ సంఘం ముఖ్యనేతల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో చేపూరి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలపై చేపూరి ఎంతోకాలంగా పోరాడుతున్నారు. యువతరానికి తనదైన పంథాలో అవగాహన కల్పిస్తూ... కుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర నాయకత్వం.. తమ సంఘాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో మరింత పటిష్టం చేసేందుకు లక్ష్మణాచారికి చాలా కీలకమైన బాధ్యతలు కట్టబెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. విశ్వబ్రాహ్మణ సమాజం కోసం తాను పడుతున్న తపనను, తన శక్తి-సామర్థ్యాలను, రాష్ట్ర నాయకత్వం మీద తనకు గల విశ్వాసాన్ని గుర్తించి, తనకు చాలా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించిన ఎర్రోజు భిక్షపతికి ఈ సందర్భంగా చేపూరి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్...

ఈటల కోటలో గెల్లు గెలుపు ఖాయమేనా?

అంచనాలకు అందనిదే రాజకీయం. ఊహించని పరిణామాలు జరిగే వేదికే ఎన్నికల రణక్షేత్రం. అందులోనూ తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయమై, టీఆర్ఎస్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈటల రాజేందర్ ను ఢీకొట్టడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి ఈటలను హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎదుర్కొనేందుకు అత్యంత సామాన్యుడైన గెల్లు శ్రీనివాస్ ను కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే అనూహ్యమైన పాచికలు వేసి శత్రువు అంచనాలు తల్లకిందులు చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన మస్తిష్కమే వినూత్న ఆలోచనల కర్మాగారం. ఏ ఆలోచన వెనుక ఏ పరమార్థం దాగి ఉందో తెలుసుకోవడం సాధారణ రాజకీయ నాయకులకు సాధ్యం కాదు. అలాంటి ఓ వినూత్నమైన ఎన్నికల ఎత్తుగడే గెల్లు శ్రీనివాస్ ఎంపిక.  టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సాధనకు అసలు సిసలు చిరునామా. ఆ ఉద్యమ తోటలో పూసిన ఒక పువ్వే గెల్లు శ్రీనివాస్. అత్యంత సామాన్యమైన యాదవ కుటుంబం నుంచి వచ్చిన గెల్లు శ్రీనివాస్ ను ఈటల మీదికి పోటీకి దింపడం, హుజూరాబాద్ లో ప్రజాభిప్రాయాన్ని టీఆర్ఎస్ కు క్రమంగా అనుకూలంగా మార్చుకోవడం, అందుకోసం తన పార్టీ పరివారం యావత్తునూ హు...

వీరబ్రహ్మేంద్రస్వామినే అటకాయిస్తున్న ప్రబుద్ధులు

తెెలుగునాటనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోనే కాలజ్ఞాన కర్తగా, భవిష్యత్ దార్శనికుడిగా సకల సమాజం చేత పూజలందుకునే యుగపురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రమే. అలాంటిది తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో సాక్షాత్తూ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కుంటాల మండలం కల్లూరు గ్రామంలో మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామికి 40 ఏళ్లకు పైగా పూజలు జరుగుతూ వచ్చాయి. అయితే స్వామివార్ల విగ్రహాలు జీర్ణావస్థకు చేరుకోవడంతో.. అలాంటి విగ్రహాలకు పూజలు చేయరాదన్న నియమాల కారణంగా ఆ విగ్రహాలను పక్కన పెట్టారు. అలా దాదాపు తొొమ్మిదేళ్లుగా వీరబ్రహ్మేంద్రస్వామి నిత్యపూజలు ఆగిపోయాయి. స్వామివార్ల విగ్రహాలు మళ్లీ పునఃప్రతిష్టించడానికి అవసరమైన వనరుల కొరత కారణంగా ఆ  విషయం వాయిదా పడుతూ వస్తోంది. అయితే అదే విగ్రహాలున్న చోట ఖాళీగా ఉంచడం ఎందుకని కొన్ని సంవత్సరాల క్రితమే దేవీ నవరాత్రులకు అంకురారోపణ చేశారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రతియేటా దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నారు.  ఇటీవల కల్లూరు గ్రామంలోని విశ్వ...

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆగేది లేదు-ఎర్రోజు భిక్షపతి

ఏ నాయకుడు ఏ పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆగేది లేదని, విశ్వబ్రాహ్మణ జాతి అభ్యున్నతి కోసం మడమ తిప్పకుండా పోరాడతానని, ఈ ప్రయాణంలో జాతి రత్నాల్లాంటివారు కూడా అడ్డుకున్నా ప్రజల మద్దతుతో ముందుకెళ్తానని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి కరాఖండిగా తేల్చేశారు. సెప్టెంబర్ 5న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జరిగిన రాష్ట్ర స్థాయి బహిరంగ సభలో భిక్షపతి తన వైఖరిని ప్రజలందరికీ విడమరచి చెప్పారు. గత పదేళ్లుగా కులసంఘంలో పని చేస్తూ జాతి అభివృద్ధి కోసం పాటు పడుతున్నానని, అన్ని రంగాల్లో వెనుకబడ్డ విశ్వబ్రాహ్మలకు ఏం చేయాలో తనకంటూ కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయన్నారు. 30 ఏళ్లకు పైగా విశ్వబ్రాహ్మణ కుల సంఘం పేరుతో పనిచేస్తున్న కొందరు పెద్దలు ఇప్పటివరకు ఏం చేశారో ఏ ఒక్కరికీ తెలియదన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఉనికి చాటుకునేందుకే సంఘాల పేరుతో అమాయకులైన విశ్వబ్రాహ్మలను మోసం చేస్తున్నారని, ఆ మోసాలను ప్రశ్నిస్తున్నందువల్లే తన మీద కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారాలు  సాగిస్తున్నాయన్నారు. అయితే కులం ఎదుర్కొంటున...

రేపటి ఉద్యమానికి నేటి నుంచే సిద్ధం కావాలి: చెల్లోజు రాజు

ఉపాధి దెబ్బతిని, కుటుంబాలు అల్లకల్లోలమవుతున్న తరుణంలో విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని, ప్రభుత్వాలు తమవైపు దృష్టి సారించేదాకానైనా తమ జాతిలో ఔదార్యం గలవారు ముందుకు రావాలని, వృత్తిపనులకు దూరమైన పేద విశ్వబ్రాహ్మల్ని ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లోజు రాజు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పలు పేద కుటుంబాలకు విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందించినట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ఆదేశాల మేరకు, కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ఇల్లంతకుంటలో సమావేశం నిర్వహించామని, ఈ సమావేశానికి మండల విశ్వబ్రాహ్మల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.  తమ జాతి ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్నారని, తెలంగాణ వచ్చిన తరువాత అనేక కులాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నా.. విశ్వబ్రాహ్మలు మాత్రం వివక్షకు గురవుతున్నారన్నారు. ఎందరో విశ్వబ్రాహ్మణ సోదరులు ఆత్మహత్యలకు పాల్పడ్డా వారి కుటుంబాలకు కనీస పరామర్శ సైతం దక్కడం లేదన్నారు. మ...

మన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయమిదే

భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయం ఆసన్నమైందని హైదరాాబాద్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు అంటున్నారు. గతేడాదికి పైగాా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం నుంచీ శాస్త్రీయ వైద్యంగా భుజకీర్తులు తగిలించుకున్న అల్లోపతి వైద్యం ఇప్పటివరకు దాని స్వభావాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిందని, అయినా పాలకులు, ప్రపంచ దేశాలు, డబ్ల్యు.హెచ్.ఒ వంటి వ్యవస్థలన్నీ ఇప్పటికీ పునరాలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నాానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే 20 వేల మందికి పైగా కరోనా పేషెంట్లకు ప్రాణభిక్ష పెడితే దాన్ని నాటువైద్యంగా అభివర్ణిస్తున్న ఆధునిక మీడియా పోకడలను ఆయన ఖండించారు.  ఏది నాటు వైద్యం? ఏది శాస్త్రీయ వైద్యం? శాస్త్రీయ వైద్యం పేరుతో లక్షల్లో ఫీజులు గుంజుతూ, పేషెంట్ ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని సంతకం చేయించుకుని మరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టే కార్పొరేట్ దవాఖానాాల్లో జరిగేది శాస్త్రీయ వైద్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ప్రాణాలు పోతే ప్రశ్నించే అవ...

భక్తిశ్రద్ధలతో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు (చిత్రమాలిక)

ప్రొఫెసర్ తియ్యబిండి కామేశ్వరరావు స్వగృహంలో తెలుగువారి ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. గతేడాది లాగే ఈసారి కూడా  కరోనా విజృంభించిన తరుణంలో వీరగురుడి ఆరాధనోత్సవాలను సాదాసీదాగా, నిష్టగా జరుపుకున్నారు. కాలజ్ఞాన ప్రదాత అయిన వీరబ్రహ్మేంద్రస్వామి 327 ఏళ్ల క్రితం కందిమల్లాయపల్లిలో జీవసమాధిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులు ఎక్కడికక్కడ స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహించుకున్నారు. పలుచోట్ల జరిగిన ఈ ఆరాధనోత్సవాలకు సకల వర్గాల ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.  ఇక విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ  ఐక్య సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం తానాజీనగర్ ఉప్పుగూడలో నిర్వహించారు. ఆ సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బండ్లగూడ మండలాధ్యక్షులు తోట శ్రీనివాసాచారి, బహదూర్ పురా మండలాధ్యక్షుడు వలబోజు రవికిరణ్, సైదాబాద్ మండలాధ్యక్షుడు వోరువాళ్ళ వీరేష్, మేడ...