Skip to main content

Posts

ఇష్టంగా చదివాడు - గోల్డ్ మెడల్ కొట్టాడు

డాక్టర్ కొడుకు డాక్టర్.. యాక్టర్ కొడుకు యాక్టర్.. లాయర్ కొడుకు లాయర్ అవడంలో వింతేం లేదు. అలా కాకుండా తాను పూర్తిగా కొత్తదారిని ఎంచుకొని  తమ కుటుంబంలో ఓ కొత్త ట్రెండును సృష్టించాడు ఓ కొడుకు. సొంతూరి ప్రజల పొగడ్తలు పక్కనపెడితే, తల్లిదండ్రుల కళ్లలో కళ్లలో ఆనందాన్ని చూడగలిగాడు. ఆ కుర్రాడే మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నందారానికి చెందిన రాజమూరి నితిన్ కుమార్ రెడ్డి. తండ్రి వకీలు కావడంతో ఆయన ప్రాక్టీసుతో పాటు కొడుక్కి మంచి చదువు చెప్పించాలని మహబూబ్ నగర్ షిఫ్టయ్యారు. చిన్నప్పటి నుంచే చదువుల మీద పూర్తి ఏకాగ్రత కనబరిచే నితిన్.. కష్టాన్ని ఇష్టంగా చేసుకొని చదివితే ఫలితం వచ్చి తీరుతుందని, అందుకు తానే ఓ ఉదాహరణగా నిలిచాడు.  పెద్దయ్యాక ఎవరేం కావాలో చిన్నప్పుడే తల్లిదండ్రుల మాటల రూపంలో పిల్లల చెవుల్లో బీజాలు పడతాయంటారు. ఆ బీజాలే వారిని చదువుల మీద నిలబెడతాయి. ఉన్నతమైన లక్ష్యాల వైపు నడిపిస్తాయి. సమాజంలో తన పాత్రేంటో తెలియజేస్తాయి. తల్లిదండ్రుల రుణమే కాదు.. సమాజ రుణం కూడా తీర్చుకోవాలనే అవగాహన కలిగిస్తాయి. అలాంటి నేపథ్యం నుంచి వచ్చినందుకు తాను...

వీకెండ్ స్టోరీ: కృషి ఉంటే యువకులు రమేశ్ లు అవుతారు

ఎవరైనా సెలవు రోజు ఏం చేస్తారు? ఆ వారం రోజులు పడిన శ్రమ అంతా మరచిపోవాలని చూస్తారు. "సేద" దీరే సమయం కోసం ఎదురుచూస్తారు. ఇక రేపటి గురించి కలలు కనేవారైతే వచ్చే వారం రోజుల్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఎవర్ని కలవాలో పక్కాగా ప్లాన్ వేసుకుంటారు. కూడికలు, తీసివేతల లెక్కల్ని గణించుకొని ముందడుగు వేస్తారు.  మరి.. కొడిచర్ల రమేశ్ ఏం చేస్తాడో తెలుసా? షేవ్ చేస్తాడు. అవును మీరు చదివింది నిజమే. సెలవు రోజుల్లో ఆయన సేవ చేస్తాడు. షేవింగ్, కటింగ్.. ఇలా తన కులవిద్య అయిన క్షవర వృత్తినే ప్రతి మంగళవారం సెలవు దినాన సేవ కోసం కేటాయిస్తాడు. ఉదయాన్నే 6 గంటలకల్లా ఇంటి నుంచి బయటపడి ఏ వృద్ధాశ్రమానికో,  అనాథాశ్రమానికో వెళతాడు. ప్రతి వారం ఏదో ఒక అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి బాబాయిల్ని, చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తాడు. జుట్టు బాగా పెరిగి చికాగ్గా కనిపించే అనాథలను ఎంతో నాగరికంగా తయారుచేసి ఆశ్రమ నిర్వాహకులకు ఎంతో ఆత్మీయ నేస్తంగా మారాడు.  డబ్బున్న మారాజులు తమ పేరెంట్స్ ని ఖరీదైన వృద్ధాశ్రమాల్లో చేర్పించి డాలర్లు పోగేసుకునేందుకు  విమానాల్లో ...

అరిగోస పెట్టి ఆపన్న హస్తం - అల్ప సంతోషంలో చిన్న పత్రికలు

ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దయ తలచారు. చిన్న, మధ్య తరహా స్థాయి పత్రికలు ఇంకా బతికే ఉన్నాయని గుర్తించారు. తామంతా బతికున్న విషయం కేసీఆర్ గుర్తించినందుకు పత్రికా యాజమాన్యాలు తెగ సంబరపడిపోతున్నారు. తమ ఆకలికేకలు తీరుతాయో లేదో తెలీదు కానీ, తమ పత్రికలకు మాత్రం  ఊపిరి పోసినందుకు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాసిన్ని ఆనందబాష్పాలు కూడా రాల్చారు. తెలంగాణ కోసం పెద్దపత్రికలు ఏం చేశాయో ఇప్పుడు చెప్పుకుంటే బాగుండదు. మదపుటేనుగు లాంటి పెద్దపత్రికల వ్యవహార శైలికి సాక్షాత్తూ ముఖ్యమంత్రులే నిండు అసెంబ్లీల్లో ఏం అభిప్రాయాలు వెలిబుచ్చారో, ఎంత ఆగ్రహం వెళ్లగక్కారో ఇప్పుడు చెప్పుకోవడం అస్సలు బాగుండదు. కానీ చిన్న పత్రికలు మాత్రం తెలంగాణవాదం మినహా మరో మాటకు తావు లేకుండా పని చేశాయి. ఉడుతా భక్తిని ప్రదర్శించాయి. ఉద్యమ నాయకుడి వెంట ఉద్యమ గొంతుకలై చిన్న పత్రికల సంపాదకులు, విలేకర్లంతా కలాలతో కవాతులు చేయించారు. అయితే ప్రజలకు వాటి రీచ్ పెద్దగా లేకపోవచ్చు గానీ ఒకవేళ ఉంటే అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలందరూ ఈ చిన్న పత్రికలనే అక్కున చేర్చుకొని ఉండే...

వరంగల్-కొత్తగూడెం: సేమ్ ఇన్సిడెంటల్ అండ్ సేమ్ పొలిటికల్ సీన్

ఆరేళ్ల క్రితం ఏం జరిగిందో.. సరిగ్గా అలాగే కాకపోయినా.. అలాంటిదే రిపీటైంది. వరంగల్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎస్. రాజయ్య ఇంట్లో నాలుగు నిండు ప్రాణాలు అగ్ని కీలలకు ఆహుతైపోతే.. కొత్తగూడెెం జిల్లా పాల్వంచలో అలాంటివే నాలుగు ప్రాణాలు బూడిదైపోయాయి. అక్కడ కాంగ్రెస్ నేత కొడుకు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భార్యను కట్నం పేరుతో రాచి రంపాన పెట్టి గ్యాస్ సిలిండర్ కుట్రకు బలిపెడితే.. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు ఆస్తి తగాదాలు పరిష్కరించే నెపంతో ఓ అసహాయుడి అర్థాంగిపై కన్నేసి, హైదరాబాద్ లోని తన గడీకి పంపించుమని ఆర్డరేసి, గడి బయట కట్టుకున్న భర్తనే కాపలాగా ఉంచే నయా కీచక పర్వానికి తెరతీశాడు. అచ్చంగా ఆనాటి గడీల పాలనకు తాజా ఆనవాలుగా నిలిచాడు. భర్తకు విషయం చెప్పలేక, ఆమెను వదిలి తానొక్కడే తన దారి తాను చూసుకోలేక, పిల్లల దారుణ భవిష్యత్  చిత్రాన్ని ఊహించుకోలేక అందరినీ తన వెంటే తీసుకుపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు, అందాలొలికే భార్యను కర్కశ మంటల్లో కాల్చేశాడు. తానూ తగులబడిపోయాడు.  కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగ రామకృష్...

బీ అలర్ట్.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో లక్షలాది కేసులు

ప్రపంచ మానవాళిని కరోనా ఓ కుదుపు కుదిపింది. దాని ప్రభావం 2022 వరకు ఉంటుందని, కేవలం ఐదారు నెలలకే ఈ సమస్య సమసిపోయేది కాదని అప్పట్లోనే కొందరు నిపుణులు అన్నారు. అదే నిజమవుతోందిప్పుడు. అయితే థర్డ్ వేవ్ గా చెప్పుకునే ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి గురించి ఆరోగ్య నిపుణులు కాసింత పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రముఖ విద్యావేద్ద, మెడికల్ ఆంత్రోపాలజీ నిపుణుడు వాసిరెడ్డి అమర్నాథ్ ఏమంటున్నారో చూడండి.  ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది. తెలంగాణ లో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది. ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు కొన్ని రెట్లు పెరుగుతూ జనవరి చివరి కల్లా లక్షల్లోకి చేరవచ్చు. ఒమిక్రాన్ ఎవరినీ వదలదు . అందరికీ సోకుతుంది.  ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే..   1. ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందికి ఎలాంటి లక్షణాలు వుండవు . మిగతా పదిమందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి . ఇది సూపర్ మైల్డ్.  2. ఓమిక్రాన్ చంపదు. ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది ఓమిక్రాన్ సోకిన వారు కోలుకున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ లు తెలియచేసారు . తెలంగాణ ...

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శ...

శ్యామ్ సింగ్ రాయ్ - ఏం ఖర్మ రా భాయ్

చిత్రం ఏమంత దరిద్రంగా వుంది??? బానే తీశారు కదా.... నటన, కథ, నాట్యం, సంగీతం, సాహిత్యం అన్నీ బానే వున్నాయి కదా.. గొప్ప చిత్రం కాకపోయినా అసహ్యంగా అయితే లేదు కదా అనే అనుమానం మనకు రాక మానదు.. నిజమే సాంకేతికంగా అన్నీ బానే వున్న చిత్రమే.... అందునా నాని చిత్రం....సాయి పల్లవి లాంటి నాట్యం నటన అద్భుతంగా చేసే నటి వున్న చిత్రం అన్నీ సమపాళ్లలో వున్న చిత్రమే. కాకపోతే వొచ్చిన చిక్కల్లా అనసరంగా పెట్టిన రెండు విషయాలు.  1. కమ్యూనిజం. 2. హిందూ ద్వేషం. అనవసరంగా పెట్టారు అనేకన్నా కావాలనే పెట్టినట్టు అనిపించింది. అందుకే పొరబాటు అయితే పోనీలే అని వొదిలెయ్యొచ్చు కానీ కావాలని చేస్తే మాత్రం తగ్గేదెలే.. అందుకే ఈ విశ్లేషణ.. అసలు నేను దీనికి విశ్లేషణ రాయకూడదు అనుకున్నా. రాసినా రెండే రెండు ముక్కల్లో ముగించెయ్యాలి న్యాయంగా.  కానీ మరీ రెండు ముక్కల్లో అయితే సదరు దర్శకుని సంగతి అంచనా వెయ్యటం కష్టం కదా, అందుకే ఇలా... మొట్ట మొదటగా కొన్ని విషయాలు చెప్పేసి తర్వాత చిత్రం గూర్చి చర్చించుకుందాం. 1. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద జోక్ ప్రజాస్వామ్య దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉండి, అది ఎన్నికల్లో పాలుపంచ...