Skip to main content

Posts

నకిలీ డీఎస్పీకి కొమ్ముకాస్తున్న అస్లీ ఖాకీలు

కర్నూల్, భాగ్యనగర్ పోస్ట్ ప్రతినిధి: శ్రీశైల మహాక్షేత్రంలో  గత సం డిసెంబర్ 31 రాత్రి నకిలీ డీఎస్పీ రజాక్ అనుచరులు శ్రీశైలం వచ్చిన భక్తులపై దాడి చేశారు. ఆ దాడిలో భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేస్తే,  ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 323, 324, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే పోలీసుల దుర్బుద్ధి, దురుద్దేశాలు ఇక్కడే బయట పడుతున్నాయంటున్నారు బాధిత భక్తులు. మారణాయుధాలతో దాడులు చేసి, రక్తాలు కారేలా కొట్టి, చంపడానికి యత్నిస్తే.. హత్యా యత్నాన్ని సూచించే 307 పెట్టకపోవడం ఏంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఆ రాత్రి శ్రీశైలంలో నకిలీ డీఎస్పీ అనుచరులు నానా బీభత్సమే సృష్టించారు. ఓ సత్రంలోని రెండో అంతస్తు నుంచి ఓ వ్యక్తిని తోసేశారు. బాధితుణ్ని  హుటాహుటిన ప్రాజెక్ట్ వైద్యశాలకు తరలించారు. తనను ఎవరు ఏం చేశారు.. ఎలా గాయాలయ్యాయో.. పోలీసుల సమక్షంలో, వైద్యుల ముందే బాధితుడు చెబుతున్నా అతని వాంగ్మూలాన్ని మాత్రం పోలీసులు రికార్డు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో తీయకపోవడం, స్టేట్మెంట్ ఫైల్ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ...

శ్రీశైలం కమ్మవారి సత్రంలో ఉచిత కంటి పరీక్షలు

శ్రీశైలంలో కాకతీయ కమ్మవారి అన్న సత్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందజేశారు. కాకతీయ కమ్మవారి అన్న సత్రం ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వారి సారథ్యంలో ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 232 మందికి కంటి పరీక్ష చేశారు. వారిలో కంటి అద్దాలు 146 మందికి, 53 మందికి కంటి శస్త్ర చికిత్సలు చెయ్యవలసి ఉంది. అయితే ఈ శిబిరంలో 63 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని, మిగిలిన 83 మందికి వారం రోజుల్లో కళ్లజోళ్లు అందిస్తామని.. 53 మందికి శస్త్ర చికిత్స మార్కాపురంలోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో ఉచితంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కమ్మ సత్రం ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్రబోస్, కమిటీ సభ్యులు కె.మల్లికార్జున, కె.రమణ,పి.వెంగయ్య, సి.విద్యాధరరావు, సత్రం మేనేజర్ రామచంద్రరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నుంచి వైద్య సిబ్బంది వి.వాసుబాబు (రీజినల్ అడ్మినిస్ట్రేటర్), కె.మహేష్ (అడ్మినిస్ట్రేటర్), జె.పాపయ్య  (అడ్మినిస్ట్రేటర్), డి.కాశి (ఐ స్పెషలిస్ట్), సి.చరణ్ (ఐ...

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి...

ఇష్టంగా చదివాడు - గోల్డ్ మెడల్ కొట్టాడు

డాక్టర్ కొడుకు డాక్టర్.. యాక్టర్ కొడుకు యాక్టర్.. లాయర్ కొడుకు లాయర్ అవడంలో వింతేం లేదు. అలా కాకుండా తాను పూర్తిగా కొత్తదారిని ఎంచుకొని  తమ కుటుంబంలో ఓ కొత్త ట్రెండును సృష్టించాడు ఓ కొడుకు. సొంతూరి ప్రజల పొగడ్తలు పక్కనపెడితే, తల్లిదండ్రుల కళ్లలో కళ్లలో ఆనందాన్ని చూడగలిగాడు. ఆ కుర్రాడే మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నందారానికి చెందిన రాజమూరి నితిన్ కుమార్ రెడ్డి. తండ్రి వకీలు కావడంతో ఆయన ప్రాక్టీసుతో పాటు కొడుక్కి మంచి చదువు చెప్పించాలని మహబూబ్ నగర్ షిఫ్టయ్యారు. చిన్నప్పటి నుంచే చదువుల మీద పూర్తి ఏకాగ్రత కనబరిచే నితిన్.. కష్టాన్ని ఇష్టంగా చేసుకొని చదివితే ఫలితం వచ్చి తీరుతుందని, అందుకు తానే ఓ ఉదాహరణగా నిలిచాడు.  పెద్దయ్యాక ఎవరేం కావాలో చిన్నప్పుడే తల్లిదండ్రుల మాటల రూపంలో పిల్లల చెవుల్లో బీజాలు పడతాయంటారు. ఆ బీజాలే వారిని చదువుల మీద నిలబెడతాయి. ఉన్నతమైన లక్ష్యాల వైపు నడిపిస్తాయి. సమాజంలో తన పాత్రేంటో తెలియజేస్తాయి. తల్లిదండ్రుల రుణమే కాదు.. సమాజ రుణం కూడా తీర్చుకోవాలనే అవగాహన కలిగిస్తాయి. అలాంటి నేపథ్యం నుంచి వచ్చినందుకు తాను...

వీకెండ్ స్టోరీ: కృషి ఉంటే యువకులు రమేశ్ లు అవుతారు

ఎవరైనా సెలవు రోజు ఏం చేస్తారు? ఆ వారం రోజులు పడిన శ్రమ అంతా మరచిపోవాలని చూస్తారు. "సేద" దీరే సమయం కోసం ఎదురుచూస్తారు. ఇక రేపటి గురించి కలలు కనేవారైతే వచ్చే వారం రోజుల్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఎవర్ని కలవాలో పక్కాగా ప్లాన్ వేసుకుంటారు. కూడికలు, తీసివేతల లెక్కల్ని గణించుకొని ముందడుగు వేస్తారు.  మరి.. కొడిచర్ల రమేశ్ ఏం చేస్తాడో తెలుసా? షేవ్ చేస్తాడు. అవును మీరు చదివింది నిజమే. సెలవు రోజుల్లో ఆయన సేవ చేస్తాడు. షేవింగ్, కటింగ్.. ఇలా తన కులవిద్య అయిన క్షవర వృత్తినే ప్రతి మంగళవారం సెలవు దినాన సేవ కోసం కేటాయిస్తాడు. ఉదయాన్నే 6 గంటలకల్లా ఇంటి నుంచి బయటపడి ఏ వృద్ధాశ్రమానికో,  అనాథాశ్రమానికో వెళతాడు. ప్రతి వారం ఏదో ఒక అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి బాబాయిల్ని, చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తాడు. జుట్టు బాగా పెరిగి చికాగ్గా కనిపించే అనాథలను ఎంతో నాగరికంగా తయారుచేసి ఆశ్రమ నిర్వాహకులకు ఎంతో ఆత్మీయ నేస్తంగా మారాడు.  డబ్బున్న మారాజులు తమ పేరెంట్స్ ని ఖరీదైన వృద్ధాశ్రమాల్లో చేర్పించి డాలర్లు పోగేసుకునేందుకు  విమానాల్లో ...

అరిగోస పెట్టి ఆపన్న హస్తం - అల్ప సంతోషంలో చిన్న పత్రికలు

ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దయ తలచారు. చిన్న, మధ్య తరహా స్థాయి పత్రికలు ఇంకా బతికే ఉన్నాయని గుర్తించారు. తామంతా బతికున్న విషయం కేసీఆర్ గుర్తించినందుకు పత్రికా యాజమాన్యాలు తెగ సంబరపడిపోతున్నారు. తమ ఆకలికేకలు తీరుతాయో లేదో తెలీదు కానీ, తమ పత్రికలకు మాత్రం  ఊపిరి పోసినందుకు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాసిన్ని ఆనందబాష్పాలు కూడా రాల్చారు. తెలంగాణ కోసం పెద్దపత్రికలు ఏం చేశాయో ఇప్పుడు చెప్పుకుంటే బాగుండదు. మదపుటేనుగు లాంటి పెద్దపత్రికల వ్యవహార శైలికి సాక్షాత్తూ ముఖ్యమంత్రులే నిండు అసెంబ్లీల్లో ఏం అభిప్రాయాలు వెలిబుచ్చారో, ఎంత ఆగ్రహం వెళ్లగక్కారో ఇప్పుడు చెప్పుకోవడం అస్సలు బాగుండదు. కానీ చిన్న పత్రికలు మాత్రం తెలంగాణవాదం మినహా మరో మాటకు తావు లేకుండా పని చేశాయి. ఉడుతా భక్తిని ప్రదర్శించాయి. ఉద్యమ నాయకుడి వెంట ఉద్యమ గొంతుకలై చిన్న పత్రికల సంపాదకులు, విలేకర్లంతా కలాలతో కవాతులు చేయించారు. అయితే ప్రజలకు వాటి రీచ్ పెద్దగా లేకపోవచ్చు గానీ ఒకవేళ ఉంటే అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలందరూ ఈ చిన్న పత్రికలనే అక్కున చేర్చుకొని ఉండే...

వరంగల్-కొత్తగూడెం: సేమ్ ఇన్సిడెంటల్ అండ్ సేమ్ పొలిటికల్ సీన్

ఆరేళ్ల క్రితం ఏం జరిగిందో.. సరిగ్గా అలాగే కాకపోయినా.. అలాంటిదే రిపీటైంది. వరంగల్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎస్. రాజయ్య ఇంట్లో నాలుగు నిండు ప్రాణాలు అగ్ని కీలలకు ఆహుతైపోతే.. కొత్తగూడెెం జిల్లా పాల్వంచలో అలాంటివే నాలుగు ప్రాణాలు బూడిదైపోయాయి. అక్కడ కాంగ్రెస్ నేత కొడుకు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భార్యను కట్నం పేరుతో రాచి రంపాన పెట్టి గ్యాస్ సిలిండర్ కుట్రకు బలిపెడితే.. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు ఆస్తి తగాదాలు పరిష్కరించే నెపంతో ఓ అసహాయుడి అర్థాంగిపై కన్నేసి, హైదరాబాద్ లోని తన గడీకి పంపించుమని ఆర్డరేసి, గడి బయట కట్టుకున్న భర్తనే కాపలాగా ఉంచే నయా కీచక పర్వానికి తెరతీశాడు. అచ్చంగా ఆనాటి గడీల పాలనకు తాజా ఆనవాలుగా నిలిచాడు. భర్తకు విషయం చెప్పలేక, ఆమెను వదిలి తానొక్కడే తన దారి తాను చూసుకోలేక, పిల్లల దారుణ భవిష్యత్  చిత్రాన్ని ఊహించుకోలేక అందరినీ తన వెంటే తీసుకుపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు, అందాలొలికే భార్యను కర్కశ మంటల్లో కాల్చేశాడు. తానూ తగులబడిపోయాడు.  కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగ రామకృష్...