కర్నూల్, భాగ్యనగర్ పోస్ట్ ప్రతినిధి: శ్రీశైల మహాక్షేత్రంలో గత సం డిసెంబర్ 31 రాత్రి నకిలీ డీఎస్పీ రజాక్ అనుచరులు శ్రీశైలం వచ్చిన భక్తులపై దాడి చేశారు. ఆ దాడిలో భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 323, 324, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే పోలీసుల దుర్బుద్ధి, దురుద్దేశాలు ఇక్కడే బయట పడుతున్నాయంటున్నారు బాధిత భక్తులు. మారణాయుధాలతో దాడులు చేసి, రక్తాలు కారేలా కొట్టి, చంపడానికి యత్నిస్తే.. హత్యా యత్నాన్ని సూచించే 307 పెట్టకపోవడం ఏంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ రాత్రి శ్రీశైలంలో నకిలీ డీఎస్పీ అనుచరులు నానా బీభత్సమే సృష్టించారు. ఓ సత్రంలోని రెండో అంతస్తు నుంచి ఓ వ్యక్తిని తోసేశారు. బాధితుణ్ని హుటాహుటిన ప్రాజెక్ట్ వైద్యశాలకు తరలించారు. తనను ఎవరు ఏం చేశారు.. ఎలా గాయాలయ్యాయో.. పోలీసుల సమక్షంలో, వైద్యుల ముందే బాధితుడు చెబుతున్నా అతని వాంగ్మూలాన్ని మాత్రం పోలీసులు రికార్డు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో తీయకపోవడం, స్టేట్మెంట్ ఫైల్ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. తక్షణం జిల్లా యంత్రాంగం
BHAGYANAGAR POST (BNP) news/views website is pride of Telugu People. It has un-detachable heartly bond with both the Telugu States. BNP covers Greater Hyderabad Political developments besides the cultural richness and social forwardness of Telangana and Andhrapradesh. Especially it contributes the dynamic political dimensions of Telugu Leaders.