Skip to main content

Posts

హైదరాబాద్ రెండో రాజధాని కాక తప్పదా?

అప్పుడెప్పుడో తెలంగాణ ఏర్పాటుకు ముందు సెకండ్ క్యాపిటల్ అన్న మాట బాగా వినిపించింది. అప్పుడు ఉద్యమ సమయం కాబట్టి.. ఒక వర్గంవారు సమర్థిస్తే.. తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్రమైన విమర్శలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి కూడా ఓ ప్రముఖ వ్యక్తి నుంచి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అవుతుందన్న ధీమా బలంగా వినిపిస్తోంది. అందుకు కారణాలేమై ఉంటాయి? దేశ రాజధానిగా ఢిల్లీ సేఫే కదా? అన్ని రకాల అంతర్జాతీయ హంగులూ అక్కడ ఉన్నాయి కదా? అయినా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలన్న ఆలోచన మళ్లీ ఎందుకు ఊపిరి పోసుకుంటోంది? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో అత్యంత సీనియర్ నేతగా ఉండడమే గాక.. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు నోటి నుంచి హైదరాబాద్ రెండో క్యాపిటల్ అన్న మాట వినిపించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని.. 1956లో అంబేద్కర్ కూడా అలాంటి అభిప్రాయమే వెలిబుచ్చారని.. అది ఈనాడు సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయని సాగర్జీ చెప్పుకొచ్చారు.  Also Read: తెలంగాణ జాతిపిత యాదిలో.. Also Read: ఆద్యంతం "వికార పురుష్" ఇది కూడా...

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ రుణాలపై అతితక్కువ వడ్డీ రేట్లు

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అన్ని రకాల గృహ రుణాలపై మిగతా బ్యాంకులన్నిటికన్నా తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయని ఏపీజీవీబీ చైర్మన్ కె.ప్రతాపరెడ్డి అన్నారు.  శుక్రవారం ఏపీజీవీబీ అశోక్ నగర్ రాస్ మెక్ మరియు సంగారెడ్డి రీజినల్ కార్యాలయాన్ని చైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గృహ రుణాలు, వివిధ రుణాల్లో ఏపీజీవీబీలోనే అతితక్కువ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయని చెప్పారు. గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదని, సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఏపీజీవీబీ అన్ని బ్రాంచులలో హౌసింగ్ మేళా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వినియోగదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీజీవీబీ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కోరారు.  ఈ కార్య్రమానికి చైర్మన్ కె. ప్రతాపరెడ్డి తో పాటు జనరల్ మేనేజర్ కె.ఈశ్వర సుబ్రమణ్యం, సంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఎస్.ఎల్.ఎన్ ప్రసాద్,అశోక్ నగర్ రాస్ మెక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ చెన్న, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. Also Read: ఆదిపురుష్ కాదు.. ఆద్యంతం వికార పురుష్

ఆదిపురుష్ కాదు.. ఆద్యంతం వికార పురుష్

నాలుగు దశాబ్దాల క్రితం దూరదర్శన్లో మహాభారత్ వచ్చినప్పుడు ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఆ తరువాత రామాయణం వచ్చినప్పుడూ అంతే మైమరచిపోయి ఆస్వాదించారు. కొన్నేళ్లుగా వస్తున్న తాజా మహాభారత్ కు కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఇతిహాస ఇతివృత్తాలపై ఎందరు ఎన్నిసార్లు సినిమా తీసినా ఆదరించే భారతీయులు.. తాజా ఆదిపురుష్ పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడాన్ని ఎవరూ ఇష్టపడరు. వినడానికి చేదుగా ఉన్నా, జీర్ణించుకోవడానికి కఠినంగా ఉన్నా.. ఆదిపురుష్ సినిమా దేశవ్యాప్తంగా వెలగబెడుతున్న నిర్వాకం మాత్రం ఇదే విషయాన్ని రూఢి చేస్తుందంటున్నారు సినీ అభిమానులు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ డిజాస్టర్ ను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. బాహుబలి వంటి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ని, తన ఇమేజ్ ని అమాంతం పెంచుకున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ కూడా అంతకుమించి అనేంతగా ఉంటుందని అంతా ఊహించారు. సనాతన భారతీయ సాహితీ సాంస్కృతిక విలువలకు ఆదిపురుష్ లో పట్టం కడతారని.. అంతర్జాతీయ రేంజ్ కు ఎదిగిన తెలుగు సినిమా.. తాజా సినిమాతో కొత్తపుంతలు తొక్కుతుందని ఆశపడ్డారు. అయితే అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అన్నట్టుగా ఆదిపురుష...

తండ్రి లేని చదువుల తల్లికి వేదాస్ ప్రోత్సాహం

చదువుకోవాలన్న పట్టుదల ఉండాలే గానీ.. ఆ చదువుల తల్లే ఏదో దారి చూపిస్తుందంటారు పెద్దలు. అదే జరిగింది.. కొక్కొండ కపిలాదేవి అనే ఇంజినీరింగ్ అమ్మాయి విషయంలో కపిలాదేవి టెన్త్ లో ఉన్నప్పుడే పరీక్షలకు ముందు తండ్రి చనిపోయాడు. అప్పటికే చదువులో టాప్ స్టూడెంట్ గా ఉన్న ఆ అమ్మాయికి.. తండ్రి పోవడంతో చదువులు ఎలా కొనసాగించాలో పాలుపోలేదు. కానీ పెద్ద చదువులు చదివి ఐఏఎస్ కావాలన్న ఆకాంక్ష మాత్రం ఆ అమ్మాయిలో బలంగా ఉంది. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా 'వేదాస్' అసోసియేషన్ ముందుకొచ్చి ఆ అమ్మాయికి అండగా నిలబడాలని నిర్ణయించుకుందని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాచారి భాగ్యనగర్ పోస్టుకు చెప్పారు. దాతల్ని కూడగట్టి అమ్మాయిని ప్రోత్సహిస్తే వెనుకబడ్డ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం మరో ఆణిముత్యాన్ని ఈ సమాజానికి అందించినవారు అవుతామని భావించామని.. ఈ క్రమంలో ఖమ్మం వాస్తవ్యుడు సుదర్శనాచారి ముందుకొచ్చారని నాగాచారి చెప్పారు.  సుదర్శనాచారి ప్రోత్సాహంతో గత మూడేళ్లుగా అమ్మాయి బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఉన్నత విద్య కొనసాగిస్తోందని చెప్పారు. కపిలాదేవిని దత్తత తీసుకున్న సుదర్శనాచారి ఆమెకు ఏది కావలిస్తే అది ఏర్పాట్లు చేయడాన...

తెచ్చుకున్న తెలంగాణలో హక్కుల సాధన కోసం మరో ఉద్యమం

తెలంగాణ సాకారమయ్యేందుకు జీవితాన్నే ధారవోసిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ కు పలువురు జర్నలిస్టులు నివాళులు అర్పించారు. జయశంకర్ లేకపోతే తెలంగాణ కల సాకారమయ్యేది కాదని, అలాంటి జయశంకర్ త్యాగాన్ని, నిస్వార్థపూరితమైన సేవభావాన్ని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెచ్చుకున్న తెలంగాణ పేదలు, బడుగులు, బలహీన వర్గాల కోసమే కాబట్టి.. వారికి ఫలాలు అందడమే ప్రత్యేక తెలంగాణ ఉద్దేశమని జయశంకర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రావడం కోసం ప్రజలంతా ఏవిధంగా బయటికొచ్చి పోరాటాలు చేశారో.. తెచ్చుకున్న తెలంగాణలో కూడా హక్కులు సాధించుకోవాలంటే మరో పోరాటం చేయాల్సి ఉంటుందని.. అందుకోసం మరోసారి జయశంకర్ ఆలోచనా విధానాన్ని వ్యాపింపజేయాల్సిన అవసరం ఉందని వివిధ పత్రికల జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.  Also Read: తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ యాదిలో.. జయశంకర్ 12వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు టి.రమేశ్ బాబు, ఎం.ఎన్.చారి, సోహైల్, మహేశ్ చారి, ప్రభుచారి, ఎస్.ఎన్.చారి OWOP ఫౌండర్ ప్రెసిడెంట్ లక్...

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు....

రాజ్ ‎కుమార్ ఖాతాలో అవార్డులు, రివార్డులు, ప్రశంసాపత్రాలు

ఆయన అవార్డుల కోసం పని చేయడు. అయినా అవార్డులు వెదుక్కుంటూ ఆయన్ని వరిస్తాయి. పని పట్ల ఆయన చూపే బాధ్యతే ఆయన వెంట అవార్డులు క్యూ కట్టేలా చేసిందంటే అతిశయోక్తి కాదంటారు ఆయన స్నేహితులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీ పీఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎస్.రాజ్‎కుమార్ ను ఇప్పటికే అనేక అవార్డులు వరించాయి. తాజాగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‎కుమార్ తన సేవలకు గాను ప్రశంసా పత్రం అందుకున్నారు.  రాజ్‎కుమార్ ఇప్పటికే 38 ఉత్తమ సేవా పురస్కారు, 24 నగదు పురస్కారాలు, మరో 4 ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన రాజ్‎కుమార్ రెగ్యులర్ పోలీస్ డ్యూటీలే గాక, అధికారులు అప్పగించే ప్రత్యేకమైన టాస్కులు, డ్రాఫ్టింగ్ వంటి ఏ పనులు అప్పగించినా అన్నింటా తన అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. అది చూసే రాజ్‎కుమార్ కోసమే పోలీస్ అధికారులు పలు ప్రత్యేకమైన పనులు అప్పగిస్తారన్న టాక్ కరీంనగర్ జిల్లాలో వినిపిస్తుంది. తాజా కార్యక్రమంలో ఎల్ఎండీ పోలీసులకు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్ఐ శీలం ప్రమోద్‎రెడ్డి, ఏఎస్ఐ నజీముద్దీన్, హెడ్...