Skip to main content

Posts

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు:                     ...

మన గురువునే మరచిపోతే ఎలా?

ప్రపంచానికి అఖండమైన, అనిర్వచనీయమైన విజ్ఞానాన్ని అందించిన గురు పరంపర కలిగిన దేశం భారతదేశం. ఈ దేశానికి ఈ గుర్తింపు రావడానికి కారణం గురువులు మాత్రమే. యుగయుగాలుగా ఎందరో యోగి పుంగవులు, ఎందరో గురువులు ఈ దేశానికే కాదు.. ఈ ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. అందుకే ఈ దేశాన్ని యోగులు సాగిన మార్గంగా చెబుతారు. మరి అలాంటి యోగుల్ని, అతుల్య గురువుల్ని స్మరించుకోవడం కనీస ధర్మం కాదా? భారతదేశంలో విస్తరించింది ఏమంటే.. యోగమే. ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నది కూడా యోగమే. అందుకే దీన్ని యోగులు నడిచిన నేలగా, యోగులు నడిపిస్తున్న దేశంగా పేర్కొంటూ ఉంటారు. ఈ దేశానికి వన్నె తెచ్చింది యోగులే. ఈ దేశానికి ఆభరణాలుగా మారిందీ.. యుగాలపాటు సాధన చేసిన గురువులే. ఈ దేశాన్ని నిలబెట్టంది ఎవరో ఒక గురువని ఎవరు చెబుతారు? ఎందరో గురువులున్నారు. ఒక్కో రుషి, ఒక్కో యోగి వేర్వేరు విషయాల్లో నిష్ణాతులయ్యారు. ప్రపంచానికి వేర్వేరు అంశాల్లో జ్ఞానామృతాన్ని అందించారు.  ఇది కూడా చదవండి: హైదరాబాద్ రెండో రాజధాని? మనిషి అంటే వేరే కాదు.. వీడు కూడా ఒక జంతువే.. కాకపోతే మాటలు నేర్చిన జంతువు అంటూ శాస్త్రీయంగా నిర్వచించిన పాశ్చాత్య పండ...

హైదరాబాద్ రెండో రాజధాని కాక తప్పదా?

అప్పుడెప్పుడో తెలంగాణ ఏర్పాటుకు ముందు సెకండ్ క్యాపిటల్ అన్న మాట బాగా వినిపించింది. అప్పుడు ఉద్యమ సమయం కాబట్టి.. ఒక వర్గంవారు సమర్థిస్తే.. తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్రమైన విమర్శలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి కూడా ఓ ప్రముఖ వ్యక్తి నుంచి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అవుతుందన్న ధీమా బలంగా వినిపిస్తోంది. అందుకు కారణాలేమై ఉంటాయి? దేశ రాజధానిగా ఢిల్లీ సేఫే కదా? అన్ని రకాల అంతర్జాతీయ హంగులూ అక్కడ ఉన్నాయి కదా? అయినా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలన్న ఆలోచన మళ్లీ ఎందుకు ఊపిరి పోసుకుంటోంది? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో అత్యంత సీనియర్ నేతగా ఉండడమే గాక.. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు నోటి నుంచి హైదరాబాద్ రెండో క్యాపిటల్ అన్న మాట వినిపించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని.. 1956లో అంబేద్కర్ కూడా అలాంటి అభిప్రాయమే వెలిబుచ్చారని.. అది ఈనాడు సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయని సాగర్జీ చెప్పుకొచ్చారు.  Also Read: తెలంగాణ జాతిపిత యాదిలో.. Also Read: ఆద్యంతం "వికార పురుష్" ఇది కూడా...

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ రుణాలపై అతితక్కువ వడ్డీ రేట్లు

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అన్ని రకాల గృహ రుణాలపై మిగతా బ్యాంకులన్నిటికన్నా తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయని ఏపీజీవీబీ చైర్మన్ కె.ప్రతాపరెడ్డి అన్నారు.  శుక్రవారం ఏపీజీవీబీ అశోక్ నగర్ రాస్ మెక్ మరియు సంగారెడ్డి రీజినల్ కార్యాలయాన్ని చైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గృహ రుణాలు, వివిధ రుణాల్లో ఏపీజీవీబీలోనే అతితక్కువ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయని చెప్పారు. గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదని, సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఏపీజీవీబీ అన్ని బ్రాంచులలో హౌసింగ్ మేళా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వినియోగదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీజీవీబీ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కోరారు.  ఈ కార్య్రమానికి చైర్మన్ కె. ప్రతాపరెడ్డి తో పాటు జనరల్ మేనేజర్ కె.ఈశ్వర సుబ్రమణ్యం, సంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఎస్.ఎల్.ఎన్ ప్రసాద్,అశోక్ నగర్ రాస్ మెక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ చెన్న, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. Also Read: ఆదిపురుష్ కాదు.. ఆద్యంతం వికార పురుష్

ఆదిపురుష్ కాదు.. ఆద్యంతం వికార పురుష్

నాలుగు దశాబ్దాల క్రితం దూరదర్శన్లో మహాభారత్ వచ్చినప్పుడు ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఆ తరువాత రామాయణం వచ్చినప్పుడూ అంతే మైమరచిపోయి ఆస్వాదించారు. కొన్నేళ్లుగా వస్తున్న తాజా మహాభారత్ కు కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఇతిహాస ఇతివృత్తాలపై ఎందరు ఎన్నిసార్లు సినిమా తీసినా ఆదరించే భారతీయులు.. తాజా ఆదిపురుష్ పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడాన్ని ఎవరూ ఇష్టపడరు. వినడానికి చేదుగా ఉన్నా, జీర్ణించుకోవడానికి కఠినంగా ఉన్నా.. ఆదిపురుష్ సినిమా దేశవ్యాప్తంగా వెలగబెడుతున్న నిర్వాకం మాత్రం ఇదే విషయాన్ని రూఢి చేస్తుందంటున్నారు సినీ అభిమానులు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ డిజాస్టర్ ను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. బాహుబలి వంటి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ని, తన ఇమేజ్ ని అమాంతం పెంచుకున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ కూడా అంతకుమించి అనేంతగా ఉంటుందని అంతా ఊహించారు. సనాతన భారతీయ సాహితీ సాంస్కృతిక విలువలకు ఆదిపురుష్ లో పట్టం కడతారని.. అంతర్జాతీయ రేంజ్ కు ఎదిగిన తెలుగు సినిమా.. తాజా సినిమాతో కొత్తపుంతలు తొక్కుతుందని ఆశపడ్డారు. అయితే అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అన్నట్టుగా ఆదిపురుష...

తండ్రి లేని చదువుల తల్లికి వేదాస్ ప్రోత్సాహం

చదువుకోవాలన్న పట్టుదల ఉండాలే గానీ.. ఆ చదువుల తల్లే ఏదో దారి చూపిస్తుందంటారు పెద్దలు. అదే జరిగింది.. కొక్కొండ కపిలాదేవి అనే ఇంజినీరింగ్ అమ్మాయి విషయంలో కపిలాదేవి టెన్త్ లో ఉన్నప్పుడే పరీక్షలకు ముందు తండ్రి చనిపోయాడు. అప్పటికే చదువులో టాప్ స్టూడెంట్ గా ఉన్న ఆ అమ్మాయికి.. తండ్రి పోవడంతో చదువులు ఎలా కొనసాగించాలో పాలుపోలేదు. కానీ పెద్ద చదువులు చదివి ఐఏఎస్ కావాలన్న ఆకాంక్ష మాత్రం ఆ అమ్మాయిలో బలంగా ఉంది. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా 'వేదాస్' అసోసియేషన్ ముందుకొచ్చి ఆ అమ్మాయికి అండగా నిలబడాలని నిర్ణయించుకుందని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాచారి భాగ్యనగర్ పోస్టుకు చెప్పారు. దాతల్ని కూడగట్టి అమ్మాయిని ప్రోత్సహిస్తే వెనుకబడ్డ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం మరో ఆణిముత్యాన్ని ఈ సమాజానికి అందించినవారు అవుతామని భావించామని.. ఈ క్రమంలో ఖమ్మం వాస్తవ్యుడు సుదర్శనాచారి ముందుకొచ్చారని నాగాచారి చెప్పారు.  సుదర్శనాచారి ప్రోత్సాహంతో గత మూడేళ్లుగా అమ్మాయి బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఉన్నత విద్య కొనసాగిస్తోందని చెప్పారు. కపిలాదేవిని దత్తత తీసుకున్న సుదర్శనాచారి ఆమెకు ఏది కావలిస్తే అది ఏర్పాట్లు చేయడాన...

తెచ్చుకున్న తెలంగాణలో హక్కుల సాధన కోసం మరో ఉద్యమం

తెలంగాణ సాకారమయ్యేందుకు జీవితాన్నే ధారవోసిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ కు పలువురు జర్నలిస్టులు నివాళులు అర్పించారు. జయశంకర్ లేకపోతే తెలంగాణ కల సాకారమయ్యేది కాదని, అలాంటి జయశంకర్ త్యాగాన్ని, నిస్వార్థపూరితమైన సేవభావాన్ని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెచ్చుకున్న తెలంగాణ పేదలు, బడుగులు, బలహీన వర్గాల కోసమే కాబట్టి.. వారికి ఫలాలు అందడమే ప్రత్యేక తెలంగాణ ఉద్దేశమని జయశంకర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రావడం కోసం ప్రజలంతా ఏవిధంగా బయటికొచ్చి పోరాటాలు చేశారో.. తెచ్చుకున్న తెలంగాణలో కూడా హక్కులు సాధించుకోవాలంటే మరో పోరాటం చేయాల్సి ఉంటుందని.. అందుకోసం మరోసారి జయశంకర్ ఆలోచనా విధానాన్ని వ్యాపింపజేయాల్సిన అవసరం ఉందని వివిధ పత్రికల జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.  Also Read: తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ యాదిలో.. జయశంకర్ 12వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు టి.రమేశ్ బాబు, ఎం.ఎన్.చారి, సోహైల్, మహేశ్ చారి, ప్రభుచారి, ఎస్.ఎన్.చారి OWOP ఫౌండర్ ప్రెసిడెంట్ లక్...