నిజామాబాద్ జిల్లా బోధన్ లో గల ఓ ప్రధాన దేవాలయంలోకి హిందువులను అనుమతించి, అక్కడ పూజలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేస్తున్నారు. బోధన్ లో గల ఇంద్రనారాయణస్వామి ఆలయాన్ని హిందువులకు అప్పగించాలని ఆయన కోరుతున్నారు. 10 శతాబ్దంలో బోధన్లో ఇంద్రనారాయణుడి దేవాలయాన్ని ఆనాటి రాష్ట్రకూట రాజైన మూడో ఇంద్రుడు నిర్మించాడని.. అది జైన్ టెంపుల్ గా చరిత్రకారులు నిర్ధారించారని అర్వింద్ చెబుతున్నారు. ఆ తరువాత కళ్యాణి చాళుక్యుల కాలంలో రాజా సోమేశ్వరుడి హయాంలో ఆలయాన్ని పునరుద్ధరించి దానికి ఇంద్రనారాయణస్వామి దేవాలయంగా నామకరణం చేశారన్నారు. ఆలయ నిర్మాణం నక్షత్రాకారంలో ఉంటుంది. ఎంతో అద్భుతమైన, ఆకర్షణీయమైన శిల్పాలు దేవాలయంలో ఆశ్చర్యం గొల్పుతాయి. ఆనాటి శిల్పాచార్యుల ప్రతిభకు దేవాలయ గోడలపై ఉన్న శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే 14వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆక్రమణ తరువాత దాన్ని మసీదుగా మార్చారు. దానికి దేవల్ మసీద్ అనే పేరు పెట్టారు. గర్భగుడిని మార్చి.. ప్రార్థనలు చేసుకునేందుకు ఓ వేదికను నిర్మించి.. మిగిలిన దేవాలయాన్ని పూర్తిగా అలాగే ఉంచి దేవల్ మసీదు
BHAGYANAGAR POST (BNP) news/views website is pride of Telugu People. It has un-detachable heartly bond with both the Telugu States. BNP covers Greater Hyderabad Political developments besides the cultural richness and social forwardness of Telangana and Andhrapradesh. Especially it contributes the dynamic political dimensions of Telugu Leaders.