Skip to main content

Posts

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...

అలుపెరుగని పోరాట యోధుడు పద్మాచారి

తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ఆఫీసర్స్ మెస్ లో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి పద్మాచారి చేసిన సేవలు మరువలేనివని. ఏ చిరు ఉద్యోగికి ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిలా ముందుండి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడే యోధుడు అని ఏసీపీ (సీసీఎస్) కె.ఎం కిరణ్ కుమార్ అన్నారు. రెండేళ్ల క్రితమే పద్మాచారి పదవీ విరమణ పొందారు. ఉద్యోగులందరూ మళ్లీ పద్మాచారిని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పద్మాచారి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కె.ఎం. కిరణ్ కుమార్ ఎ.సి.పి(సి.సి.ఎస్) మాట్లాడుతూ... పద్మాచారి లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా పని చేయటం, ఉద్యోగుల సమస్యలు ఎంత జటిలంగా ఉన్నప్పటిక...

గురుపూజలో పాల్గొనండి విజ్ఞానాన్ని ఆర్జించండి

సనాతన ధర్మంలో గురుపూజకు ఉన్న ప్రాశస్త్యాన్ని నేటి తరం ప్రజలు గుర్తించాలని, సద్గురువుల కృపకు పాత్రులు కావాలని జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా కోరారు. జేకేఆర్ జ్యోతిష్య విజ్ఞాన పరిశోధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్ పల్లిలోని కళాసాగరంలో గురుపూజా ఉత్సవం జరుగుతుందని రాజా తెలిపారు. భారతీయ గురు పరంపర ఎప్పుడూ విజ్ఞానాన్ని విస్తరించిందని.. వారి కృషి వల్లే అనేక రకాల ఖగోళ, వాస్తు, యోగ విజ్ఞానం వంటి శాస్త్రాలు జన బాహుళ్యంలోకి చొచ్చుకు వెళ్లాయన్నారు రాజా. ఆ పరంపరలో భాగంగానే జేకేఆర్ ఫౌండేషన్ కృషి చేస్తోందని.. అంతటి అద్భుతమైన విజ్ఞానాన్ని అందిస్తున్న గురు పరంపరకు కృతజ్ఞతలు తెలుపుకోవడం ద్వారా మరింత విజ్ఞానాన్ని ప్రజలంతా అందుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు.  కళాసాగరంలో ఉదయం 10 గంటలకు నిపుణులైన జ్యోతిష్య శాస్త్రవేత్తల ప్రసంగాలు మొదలవుతాయని రాజా చెప్పారు. స్పిరిచ్యువల్ ఆస్ట్రాలజీ, ఫార్మా ఇండస్ట్రీలో ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, పామిస్ట్రీ, సుఖవంతమైన వివాహ జీవితం కోసం ఆస్ట్రాలజీని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. జేకేఆర్ ఫౌండేషన్ కు ఫ్...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప...

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుక...